అన్ని రాష్ట్రాలు వలస కార్మికులను తరలించడానికి శ్రామిక్ రైళ్ళను అనుమతించండి. మూడు నాలుగు రోజుల్లో వలస కార్మికులు అందరిని తరలిస్తాం. ఇందుకోసం ప్రతీ రోజు 300 రైళ్ళను నడపడానికి కేంద్ర రైల్వే శాఖ సిద్దంగా ఉంది... కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ రాష్ట్రాలకు చేసిన విజ్ఞప్తి ఇది. 

 

అంటే ఇప్పుడు కేంద్రం తన నిర్ణయాన్ని ఈ రూపం లో చెప్పింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. శ్రామిక్ రైళ్ళను ఎప్పుడు అయితే మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా కేంద్రం పరోక్ష సంకేతాలు ఇచ్చింది అనే వ్యాఖ్యలు వినపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు వేగంగా లాక్ డౌన్ 7 రోజుల్లో ముగుస్తున్న తరుణంలో వలస కార్మికులను తరలించాలి అనే నిర్ణయం వెనుక ఇదే కారణం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: