జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా, నిలుస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలైన విషవాయువుల వల్ల ప్రజలు ఎంతో భయపడ్డారని.... వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఐదు గ్రామాల ప్రజలు పరిశ్రమ వల్ల ముప్పు ఉందని భయాందోళనకు గురవుతున్నారని... విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. బాధిత ప్రాంతాల ప్రజలు సంస్థను తరలించాలనే డిమాండ్ తో పాటు ఇతర విషయాలను తన దృష్టికి తెచ్చారని అన్నారు. 
 
బాధిత గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు జనసేన వారికి అండగా ఉంటుందని అన్నారు . రాష్ట్రంలోని రసాయన, పెట్రో సంబంధిత పరిశ్రమలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ను రక్షించే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పరిశ్రమలను తరలించడంతో పాటు జీవిత కాల వైద్యాన్ని అందించాలని పవన్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: