ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కరోనా భయంతో వణికి పోతున్నారు. ముఖ్యంగా గర్భిణులు  ఈ కరోనా వైరస్ ఎటాక్ అవ్వడం చూస్తున్నాం. పుట్టిన చిన్నారును సైతం ఈ కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా సాధారణంగా పుట్టిన శిషువు మహా అంటే రెండు, మూడు కిలోలు ఉంటాడు.  అదిక బరువు ఉంటే సిజేరియన్ చేయాల్సి వస్తుంది.  పూర్తి నెలలు  నిండ కుండా పుడితే పావు తక్కువ రెండు కిలోల బరువుతో పుడతారు. అయితే ఇందుకు భిన్నంగా ఖమ్మం జిల్లాలో ఓ మహిళ 5 కిలోల బరువు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. జిల్లాలోని పెనుబల్లి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

 

వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణికి నెలలు నిండాయి.   పెనుబల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే సాధారణ కాన్పు కావడం కష్టంగా భావించిన వైద్యులు.. ఆమెకు ఆపరేషన్ చేసి పండండి ఆడబిడ్డకు పురుడు పోశారు.పుట్టిన ఆడ శిశివు 5 కిలోల 100 గ్రాముల బరువు ఉందని వైద్యులు వెల్లడించారు. ఇంత బరువుతో ఒక శిశువు జన్మించడం అరుదైన ఘటనగా చెప్పుకొచ్చారు. కాగా, మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. కాగా, తల్లి పిల్ల ఇద్దరు మంచి ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: