భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో  ఆదివారం రాత్రి 8.45గంటలకు చేరారు.  మన్మోహన్‌ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయ‌న చాలా కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో మన్మోహస్‌ సింగ్‌కు ఇప్పటికే రెండుసార్లు బైపాస్‌ సర్జరీ జరిగింది.

 

ఇదిలా ఉండ‌గా.. మన్మోహన్ సింగ్‌‌ 2004 నుంచి 2014 వరకు ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. త‌న‌దైన పాల‌న‌తో అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా ఆయ‌న అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ఆయ‌న ఎంతో కృషి చేశారు. గత మూడు దశాబ్దాలుగా మన్మోహన్‌ అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజస్థాన్‌ నుంచి మన్మోహన్‌ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఏప్రిల్‌ 3 వరకూ ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: