క‌రోనా వైర‌స్ బారి నుంచి ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్ర‌మంగా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌డుతోంది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియాలోని ప‌లు రాష్ట్రాల్లో తిరిగి పాఠ‌శాల‌ల ప్రారంభించేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. సోమ‌వారం నుంచి పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత పాఠ‌శాల‌లు ప్రారంభం అవుతుండ‌డంతో పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన‌ న్యూ సౌత్ వేల్స్, ఉత్తర రాష్ట్రమైన క్వీన్స్లాండ్ విద్యార్థులు నేటి నుంచి స్కూళ్ల‌కు వెళ్ల‌నున్నారు.

 

అయితే.. పరిమితుల‌ ప్రాతిపదికన తిరిగి పాఠశాలు ప్రారంభిస్తున్నారు. ఇక‌ ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 6,927 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్ప‌టివ‌ర‌కు 6,035మంద వైర‌స్ బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యాయి. మొత్తం 97మంది కొవిడ్‌-19తో మ‌ర‌ణించారు.  ఇదిలా ఉండ‌గా.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: