మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడానికి అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి. మహారాష్ట్ర సిఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏ చట్ట సభ లో కూడా సభ్యుడు కాకపోవడం, ఆరు నెలలు అవుతున్నా ఏ చట్ట సభకు ఆయన వెళ్లకపోవడం తో ఇక సిఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమని భావించారు. 

 

ఎమ్మెల్సీ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడటం తో ఆయన పదవి ఇక ఉండే అవకాశం లేదని అనుకున్నారు. అయితే అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్ధులు నామినేషన్ వేసారు. దీనితో ఆయన ఎన్నిక అవుతారా లేదా అనేది సందేహంగా మారిన తరుణంలో కాంగ్రెస్ అభ్యర్ధులు నామినేషన్ ని విత్ డ్రా చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: