కరోనా వైరస్ పుట్టిన ఊహాన్ లో ఇప్పుడు మళ్ళీ కరోనా తొలి కేసు రెండో వెర్షన్ లో మొదలయింది. వెళ్ళినట్టే వెళ్ళిన కరోనా మళ్ళీ ఊహాన్ లో అడుగు పెట్టింది. అక్కడ 36 రోజుల తర్వాత తొలి కరోనా కేసు నమోదు అయిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఊహాన్ పక్కనే ఉన్న హుబే ప్రావిన్స్ లోనే కరోనా కేసులు వచ్చాయి. 

 

రెండు మూడు నెలల క్రితం ఊహాన్ కి చుక్కలు చూపించిన కరోనా వైరస్ ని చాలా జాగ్రత్తగా చైనా కట్టడి చేసింది. ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కోటి మంది జనాభా ఉన్న నగరంలో ఇప్పుడు మళ్ళీ కరోనా కేసు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: