దేశంలో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైళ్లు, బస్సులు నడిపేందుకు పరిమిషన్ ఇచ్చింది.  తాజాగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులతో పాటు, ఇతర పనులపై వచ్చి చిక్కుకుపోయిన వారిని సిటీ బస్సుల్లో ఆయా ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బస్సులను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత భౌతిక దూరం నిబంధనల ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను నియమించారు.తమ పరిధిలో ఉన్న వలస కార్మికుల వివరాలను ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు చేస్తున్నారు. దీంతో వారి సంఖ్యను బట్టి బస్సులు నడుపుతున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను నియమించారు. నగరంలో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు మొత్తం 600 బస్సులను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: