దేశ వ్యాప్తంగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట వర్షాలు భారీగా పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

 

ఇక రాయలసీమ లో కూడా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అండమాన్‌ తీర ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశ౦ ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటక, విదర్భ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: