కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి అనేక దేశాలు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విదేశాల్లో భార‌తీయులు చిక్కుకుపోయారు. వీరంద‌రినీ భార‌త్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందే భార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ వందేభార‌త్ మిష‌న్ గ‌త‌ ఐదు రోజులుగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికే అనేక దేశాల‌న ఉంచి భార‌తీయుల‌ను షిప్‌లు, విమానాల్లో తీసుకొస్తోంది. ఐదో రోజైన సోమ‌వారం ఏడు ప్ర‌త్యేక విమానాలు వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా న‌డువ‌నున్నాయి.

 

ఈ ఏడు ప్ర‌త్యేక విమానాల్లో ఒక విమానం ఇప్ప‌టికే 300 మంది ప్ర‌యాణికుల‌తో లండ‌న్ నుంచి బ‌య‌లుదేరి ఢిల్లీ మీదుగా ఈ తెల్ల‌వారుజామున బెంగ‌ళూరుకు చేరుకుంది. ఇక మ‌రో ఆరు విమానాల్లో ఒక‌టి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా హైద‌రాబాద్‌కు రానున్న‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రో విమానం ఢాకా నుంచి ముంబైకి, ఇంకో దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకోనున్నాయి. మిగ‌తా మూడు విమానాల్లో ఒక‌టి అబుదుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు, మ‌రొక‌టి కౌలాలంపూర్ నుంచి చెన్నైకి, ఇంకొక‌టి బ‌హ్రెయిన్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంటాయ‌ని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: