రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. నాన్నా.. అన్ని సమయాల్లోనూ నువ్వు నాకు అతి పెద్ద బలంగా నిలిచావని ఆమె పేర్కొన్నారు. ఎప్పుడూ నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలని... మన కుటుంబ సంతోషమే నీకు అతి ముఖ్యమైనదని చెప్పారు. 

 

జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఆమె ఆకాంక్షించారు. ప్రతి రోజూ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా అని పేర్కొన్నారు. కాగా సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని దిల్ రాజు వివాహం చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: