విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను సాయంత్రం నాలుగు గంటల తర్వాత గ్రామాల్లోకి అనుమతిస్తామని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం అందించారు. గ్రామాల్లో మాడిపోయిన చెట్లను కూడా పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారు. 

 

కేంద్ర ప్రభుత్వం సహకారంతో గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. పూర్తిగా శానిటేషన్ అయిన తర్వాతే ప్రజలను గ్రామాల్లోకి అనుమతి ఇస్తామని చెప్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందాలు గ్రామాలలో పర్యతిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దు అని మంత్రులు చెప్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్లకు పరిహారం అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: