వందే భారత్ మిషన్ లో భాగంగా నేటి నుంచి రాష్ట్రానికి ప్రవాసుల రాక ప్రారంభమవుతుంది. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే విదేశాల్లో ఉన్న వారు ఏపీలో అడుగు పెట్టనున్నారు. వారి కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలను చేపట్టింది. 

 

ఏపీలో అడుగుపెట్టేవారికి వైద్య పరీక్షలు, ఐసోలేషన్‌పై ప్రొటోకాల్‌కు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణా సర్కార్ తరహాలోనే వారిని ఏపీ సర్కార్ కూడా పెయిడ్ క్వారంటైన్ కి తరలిస్తుంది. కాగా గన్నవరం, విశాఖ విమానాశ్రయాలకు ప్రవాసులు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: