భార‌త్‌లో క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న కొవిడ్‌వారియ‌ర్స్ సంఖ్య రోజురోజుకూ అధిక‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌ధానంగా వైద్యులు, న‌ర్సులు, పోలీసులే ఎక్కువ‌గా ఉంటున్నారు. ఇక తాజాగా.. ముంబైలో ఈ ఒక్క‌రోజే ఏకంగా 221మంది పోలీసులు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇందులో వంద‌మందికిపైగా ఉన్న‌తాధికారులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ముంబైలో క‌రోనా వైర‌స్ సోకిన పోలీసుల సంఖ్య ఏకంగా 1007కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు పోలీసులు క‌రోనాతో మృతి చెందారు. ఈ ప‌రిణామాల‌తో పోలీస్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి.

 

ఒక్క‌రోజులోనే ఇంత‌మందికి వైర‌స్ సోకితే.. ముందుముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయోన‌ని భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు పోలీసులు. ఇక దేశ‌వ్యాప్తంగ చూసుకుంటే.. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన పోలీసుల సంఖ్య మ‌రింత ఎక్కువ‌గానే ఉంటుంద‌ని చెప్పొచ్చు. అయినా.. క‌రోనా మ‌హ‌మ్మారిపై త‌మ పోరు ఆగ‌ద‌ని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాల‌కు తెగించి, క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరుసాగిస్తున్న పోలీస్‌వ‌ర్గాల‌కు, వైద్యుల‌కు దేశంమొత్తం సెల్యూట్ చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: