దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా విజృంభణతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ వల్ల వ్యాపార, వాణిజ్య సేవలతో పాటు ప్రజా రవాణా స్తంభించింది. కేంద్రం మూడో విడత లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో సడలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మే 11 నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కేసుల తీవ్రత దృ ష్ట్యా ప్రజారవాణా వ్యవస్థను ఈ నెలలో అందుబాటులోకి తీసుకురాకూడదని భావిస్తోంది. కేంద్రం మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం రాష్ట్రంలో మెట్రో రైళ్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నెల 17 తర్వాత హైదరాబాద్ నగరంలో కేంద్రం ఆదేశాలు ఇస్తే మెట్రో రైలు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: