ఇప్పుడు  యూరప్ లో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అందరూ కూడా లాక్ డౌన్ ని సడలించడం తో ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు కరోనా హాట్ స్పాట్ గా ఉన్న స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పుడు ఆంక్షలను  సడలించారు. 

 

దీనితో జనాలు బయటకు వచ్చి హెయిర్ కట్ చేయించుకోవడం తమకు అవసరం అయిన వాటిని కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకు వచ్చిన ఫోటో లు వైరల్ అవుతున్నాయి. హెయిర్ కట్స్ చేయించుకోవడానికి షాపులకు వెళ్ళినవి కూడా కొందరు ఫోటో లు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా లో కూడా ఇవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: