దేశంలో ఫిబ్రవరి నుంచి కరోనా మొదలైంది. మార్చి 24 న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ వల్ల చిరు ఉద్యోగులు, వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారు. వలస కూలీలు సతమతమయ్యారు..దాంతో ఈ మద్య వలస కూలీలు తమ స్వస్థలం చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.  తాజాగా  కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ 3.0 మరో వారంలో ముగియనుంది. మే 17 తర్వాత లాక్‌డౌన్‌ను సడలిస్తారా? లేక లాక్‌డౌన్‌ 4.0 ప్రకటన ఉంటుందా?? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కొంచెం సేపటి క్రితం ప్రారంభమైంది. ‘కొవిడ్-19’, లాక్ డౌన్ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. 

 

ఇంతకు ముందు కాన్ఫరెన్స్‌లలో కేవలం 9 మంది ముఖ్యమంత్రులతోనే మాట్లాడిన ప్రధాని.. ఈ సారి అందరు సీఎంలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల్లో ‘కరోనా’ నివారణకు తీసుకుంటున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు.  దేశంలోని 734 జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించారు. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లకు వెసులుబాట్లు కల్పించారు. ప్రధానంగా మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే ప్రధాని వీసీలో మరిన్ని సడలింపులపై చర్చించే అవకాశాలున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: