ర‌క్ష‌ణ రంగంపై భార‌త్ ప్ర‌త్యేక దృష్టిసారిస్తోంది. త్రివిద ద‌ళాల‌ల‌ను అత్యంత శ‌క్తిమంతంగా తీర్చిదిద్దేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోంది. నిజానికి.. సుదీర్ఘ‌కాలంగాపాటు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను భార‌త్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌ర‌మైన అత్యాధునిక ఆయుధ సంప‌త్తిని సంపాదించుకోవ‌డంపై దృష్టి సారించ‌లేదు. భార‌త్‌తో యుద్ధానికి దిగే దేశాలు ఏవీ లేవంటూ ర‌క్ష‌ణ రంగాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్యా, త‌దిత‌ర దేశాల నుంచి సెకండ్ హ్యాండ్ యుద్ధ విమానాలు, స‌బ్‌మెరైన్ల‌ను తెప్పించుకుని వాడుకుంది భార‌త్‌. కానీ.. కొన్నేళ్లుగా ప‌రిస్థితి మారింది. ర‌క్ష‌ణ రంగానికి బ‌డ్జెట్‌లో అధిక‌మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. త్రివిద ద‌ళాల‌ల‌పై భారీగా ఖ‌ర్చుపెడుతోంది.

 

ఇందులో భాగంగానే అత్యాధునిక యుద్ధ విమానాలు, స‌బ్‌మెరైన్లు, ఇత‌ర ఆయుధ సామ‌గ్రిని స‌మ‌కూర్చే దిశ‌గా అడుగులు వేస్తోంది. నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని స‌మ‌కూర్చేందుకు భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త త్రివిద ద‌ళాలు అత్యంత శ‌క్తిమంతంగా మారుతున్నాయి. ఇలా ప్ర‌తీయేటా భార‌త్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు భారీగా నిధులు కేటాయిస్తే.. 2030నాటికి భార‌త్ తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. అమెరికా, చైనాల త‌ర్వాత భార‌త్ నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. భార‌త ప్ర‌భుత్వం ఇదే ట్రెండ్‌ను కొన‌సాగిస్తుందా..?  లేదా..? అన్న‌ది చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: