ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. మోదీ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పని చేసి కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మన ముందు ప్రస్తుతం కరోనా అనే ఛాలెంజ్ ఉందని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామాలకు వైరస్ వ్యాపించకుండా చేయడమే తక్షణ కర్తవ్యం అని చెప్పారు. 
 
పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను మోదీ అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడించటానికే మొగ్గు చూపారని తెలుస్తోంది. అయితే కేంద్రం మూడో విడత లాక్ డౌన్ అనంతరం ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది. దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: