మన దేశంలో కరోనా ఎప్పటి నుంచి మోదలైందో కానీ అప్పటి నుంచి ఎవరికీ కంటిమీద కునుకు లేకండా పోతుంది.  కనిపించని శత్రువుతో రోజూ పోరాటం చేయాల్సి వస్తుంది.  విచిత్రం ఏంటంటే ఈ కరోనా లక్షణాలు త్వరగా బయటపడకపోవడం.. ఆ వ్యాధి ఉన్నవారు ఇతరులతో దగ్గరగా గడపడం ద్వారా మరింత వ్యాప్తి చెందుతుంది.  మనల్ని ప్రతిరోజూ రక్షించే డాక్టర్లు, పోలీసులను దేశాన్ని కాపాడుతున్న సైనికులను కూడా వదలడం లేదు. తాజాగా భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

 

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో త్రిపుర, ఢిల్లీ నుంచి ఇద్దరు జవాన్లు, కోల్‌కతా నుంచి నలుగురు జవాన్లు ఉన్నారు.  ఇప్పటికే పలువురు జవాన్లకు కరోనా వ్యాపించిన విషయం విదితమే. ఈ ఆరుగురు కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందు తున్నట్లు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.  దేశంలో అత్యధింకంగా కరోనా కేసులు మహరాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: