కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఆర్ధిక కష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు ఉద్యోగుల జీతాల్లో కోతలను విధిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చాయి. లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భారీగా కోతలు విధించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు ఇటీవల వస్తున్న వార్తపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో... ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినా సరే... జీతంలో ఎలాంటి కోతలు ఉండవని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: