రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కొంచెం సేపటి క్రితం ప్రారంభమైంది.  భారత దేశంలో ఫిబ్రవరి నుంచి మొదలైన కరోనా కేసులు మార్చిలో బాగా పెరగడంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఆర్థక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయిన విషయం తెలిసిందే. అన్ని రంగాలు మూత పడటంతో ఆయా రాష్ట్రాలకు ఆర్థిక రాబడి పూర్తిగా తగ్గిపోయింది. తాజాగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతున్నారు.  రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేసి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.  ప్రస్తుతం మన ముందు ఓ ఛాలెంజ్ ఉందని సీఎంలతో మోడీ వ్యాఖ్యానించారు.

 

దురదృష్టం కొద్ది ఈ కరోనా మహమ్మారి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే నమోదు అవుతుందని.. అయితే ఇది గ్రామీణ స్థాయి వరకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అదరికీ ఉందని అన్నారు. భారత్‌లోని గ్రామాలకు కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రధాని మోడీ సీఎంలతో అన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీ అభినందించారు.  ఇప్పటి వరకు అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులు సరైన పద్దతులు పాటిస్తూ...  ప్రజలను జాగృతం చేస్తూ వస్తున్నారిన ప్రజలకు కూడా లాక్ డౌన్ ఎంతో కఠినంగా పాటిస్తున్నారని అభినందించారు.  ఈ కష్టం మరెంతో కాలం ఉండదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: