ప్రపంచంలోని దేశాలన్నింటిలో భిన్నత్వంలో ఏకత్వంతో భారత్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అన్ని దేశాలతో సత్సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే భారత్ 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజస్థాన్ లోని ఫోక్రాన్ ఏరియాలో అణు పరీక్షలను నిర్వహించింది. రెండు దశాబ్దాల క్రితమే భారత్ కొన్ని దేశాలకే పరిమితమైన అణు శక్తిని, అణుబాంబులను సొంతం చేసుకుంది. 
 
మొదటి స్వతంత్ర యుద్ధం అనంతరం అమెరికా అగ్రరాజ్యంగా ఎదగటంతో ఇండియా సైతం ఎదగడానికి ప్రయత్నం చేసింది. ఇంధిరా గాంధీ సమయంలో అణు పరీక్షలు నిర్వహించిన భారత్ 1998 మే 11న ఏపీజీ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అణు పరీక్షలు నిర్వహించింది. ఆ కాలంలో అమెరికా కళ్లు గప్పి అణు పరీక్షలు నిర్వహించడం చాలా కష్టమైనా ఇండియా సులువుగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. 
 
అనంతరం అమెరికా ఇండియాపై ఆంక్షలు విధించింది. భారత్ మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా ప్రకటించింది. భారత్ భవిష్యత్తులో అంతరిక్షంలోకి మనిషిని పంపటానికి... స్పేస్ మిషన్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: