ప్రధాని నరేంద్ర మోడీ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చెయ్యాలని ఆదాయం పడిపోయింది అని ప్రజల కష్టాలను తొలగించాలి అంటే ఇప్పుడు కేంద్ర సహకారం అవసరం అని మోడీ తో జగన్ అన్నారు. ఇక ఈ సందర్భంగా మరి కొన్ని వ్యాఖ్యలు చేసారు.

 

భయం ఆందోళన తొలగిస్తేనే సాధారణ పరిస్థితి సాధ్యమని జగన్ పేర్కొన్నారు. కరోనాను నియంత్రించకాపోతే ముందుకు వెళ్ళడం కష్టమని అన్నారు. ప్రజలు తమ అంతట తాము ఐసోలేషన్ కి వెళ్ళాలి అని సూచించారు. ఏపీలో కరోనా కేసులను కట్టడి చేసామని 85 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలే కనపడుతున్నాయని జగన్ అన్నారు. ప్రజలు పరిక్షలకు స్వచ్చందంగా ముందుకు రావాలని జగన్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: