ప్రధాని నరేంద్ర మోడితో ఏపీ సిఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రధాని దృష్టికి జగన్ తీసుకుని వెళ్ళారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్దికి 16 వేల కోట్లు అవసరం అని ఆయన అన్నారు. రాష్ట్రాలకు దీర్ఘ కాలిక వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రాష్ట్రాల మధ్య రవాణా కు ఉన్న అవరోధాలు తొలగిపోవాలని జగన్ విజ్ఞప్తి చేసారు. 

 

ప్రజా రవాణా లేకపోతే సాధారణ పరిస్థితి రాదని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర సహకారం కవాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 87 వేల ఎస్ ఎం ఈ లలలో 10 లక్షల మందికి చేయూత  ఇవ్వాలని అన్నారు. కోవిడ్ తో నష్టపోయిన రాష్ట్రాని కి కేంద్రం సహకారం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: