తెలుగు రాష్ట్రాలో గత మార్చి నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  ఎక్కువ రద్దీ ఉండే రవాణ వ్యవస్థను కూడా పూర్తిగా నిషేదించారు.  ఇక ఏపిలో ప్రస్తుతం కొంత సడలింపు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏపిలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలను ప్రభుత్వం పెంచిదంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఛార్జీలు ఐభై శాతం పెరబోతున్నాయని ప్రజలకు మరింత భారం పడబోతుందని రూమర్లు సృష్టిస్తున్నారు.. ఇది పూర్తిగా అవాస్తవం అని మంత్రి అన్నారు.

 

లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా ఛార్జీలు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచామంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పక్షపాతి అని.. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ పని ఆయన చేయరని.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్న ప్రజల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: