ఇప్పుడు కరోనా కట్టడి కావాలి అంటే కచ్చితంగా మాస్క్ అనేది చాలా అవసరం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ లకు మంచి డిమాండ్ అనేది వచ్చింది. ప్రజలు అందరూ కూడా మాస్క్ లను కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఇదే కొందరికి వ్యాపారంగా మారిపోయింది. 

 

చెత్తలో పడేసిన వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. లాటిన్ అమెరికాతోపాటు మెక్సికో నగరంలో వినియోగించిన చెత్తబుట్టల్లో పారేసిన సర్జికల్ ఫేస్ మాస్క్‌లను తిరిగి అమ్ముతున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటివి కరోనా వ్యాప్తికి ప్రధానంగా మారతాయని కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాస్క్ ల కొరత ఉన్న నేపధ్యంలోనే ఈ అమ్మకాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: