భారత్ కు అసలు కరోనా ముప్పు జులై లో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత రాయబారి డేవిడ్ నబారో హెచ్చరించారు. ఆ నెలలో భారత్ లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కొంత కాలం కేసులు తగ్గుతున్నా అసలు ముప్పు ముందు ఉంటుంది అని ఆయన చెప్పారు. 

 

ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం తోనే కరోనా కట్టడిలో ఉందని ఆయన అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకొన్నాళ్ళు లాక్ డౌన్ ని పొడిగించడం ద్వారా ఇండియా లో కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసే అవకాశం ఉంటుందని ఆయన  పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశంలో 67 వేల కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: