మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు సోమవారం తెలిపాయి. కొన్ని కొత్త ఔషధాల వాడకంతో రియాక్షన్‌ వచ్చి జ్వరం రావడంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌ను ఎయిమ్స్‌లో చేర్పించిన విష‌యం తెలిసిందే. అయితే, సోమవారం ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగైందని ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు కరోనా నిర్ధార‌ణ‌ పరీక్ష కూడా నిర్వహించామని, ఫలితం నెగెటివ్‌ అని వచ్చిందని పేర్కొన్నాయి. నిజానికి.. ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ప్పుడు అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. ఈ ప‌రీక్ష‌ల్లో ఏం తేలుతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా చూశారు. కానీ.. ఆయ‌నకు నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

 

అయితే.. ఆరోగ్యం చాలావ‌ర‌కు మెరుగుప‌డ‌డంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ చేసే అవ‌కాశాలు ఉన్నట్లు ఆస్ప‌త్రివ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా మ‌న్మోహ‌న్‌సింగ్ కొన‌సాగుతున్నారు. ప్ర‌ధాన మంత్రిగా మ‌న్మోహ‌న్ సింగ్ అనేక ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి కృషి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: