ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు, అతన్ని వెస్టిండీస్ లెజండరీ బ్యాట్స్ మాన్ బ్రియాన్ లారాతో పోలుస్తూ కామెంట్స్ చేసాడు. నేటి తరంలో ఎవరిని బెస్ట్ ఆటగాడిగా ఎంపిక చేస్తారు అని అడగగా విరాట్ కోహ్లీ ని అని స్పష్టంగా చెప్పాడు. పాంటింగ్, కల్లిస్ మరియు సంగక్కర్రా, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లీ తన బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. 

 

తాను మేరీలెబోన్ క్రికెట్ క్లబ్‌తో కలిసి వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు బ్రియాన్ లారా ఆధిపత్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నాడు. కాగా కుక్ 2018 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ వన్ డే టెస్ట్ బ్యాట్స్మెన్ గా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: