ఇప్పుడు కరోనా న్యూ హాట్ స్పాట్ గా చెప్తున్న రష్యాలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతూ పోతుంది. కరోనా కట్టడి చేయడానికి ఆ దేశం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రతీ రోజు కూడా 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆ దేశంలో కరోన కేసులు ఇటలీని దాటి పోయాయి కూడా. 

 

సోమవారం ఆ దేశంలో 11,656 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2,21,344కు నమోదు చేసారు. ఇటలీలో కరోనా కేసులు 2,19,814 మాత్రమే ఉన్నాయి. రాజధాని మాస్కోలోనే 6,169 కేసులు సోమవారం నమోదు అయ్యాయి. ప్రభుత్వ అధికారులలో కూడా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాలు కూడా క్రమంగా ఆ దేశంలో పెరగడం ఆందోళన కలిగించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: