దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే కరోనా వ్యాధిగ్రస్తులను ఆరోగ్య భద్రతకు క్వారంటైన్ లో కొన్ని రోజుల పాటు ఉంచుతున్న విషయం తెలిసిందే. వారికి నెగిటీవ్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నారు.  అయితే కొన్ని చోట్ల క్వారంటైన్ వసతులు సరిగా లేవని కరోనా రోగులు తిరగబడుతున్న విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల నుంచి పారిపోతున్నారు. ఇక జీవితం పై విరక్తితోఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.  తాజాగా 15 రోజుల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తూ, వచ్చి నెల రోజులైనా తనను ఇంటికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి హల్‌చల్ చేశాడు. సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడి నెల రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరాడు.

 

సదరు వ్యక్తికి  పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినప్పటికీ అతడిని డిశ్చార్జ్ చేయలేదు. దాంతో విసుగు చెందిన ఆ రోగి తనను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారిన వైద్య సిబ్బందిపై తిరగబడ్డాడు.  సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. రెండు వారాల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారని, కానీ తానొచ్చి నెల రోజులైనా పంపడం లేదని వారితో గొడవపెట్టుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అతడిని సముదాయించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పడంతో అతడు వెనక్కి తగ్గాడు. అయితే కరోనా లక్షణాలు మెల్లి మెల్లిగా బయట పడుతున్నాయని.. ఈ నేపథ్యంలోనే కొంత మందికి పలు మార్చు చెక్ చేయాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: