తెలంగాణాలో రైలు సర్వీసులను వద్దనే ఆలోచనలో తెలంగాణా సిఎం కేసీఆర్ ఉన్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులు ఆగుతాయి. కేంద్రం నేటి నుంచి 15 జతల రైలు సర్వీసులను నడపడానికి సిద్దమైంది. ఇప్పుడు వాటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. 

 

ఇతర రాష్ట్రాలు అంటే ప్రధానంగా సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి, ఏపీ, తమిళనాడు నుంచి ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. కరోనా ఇప్పుడు లక్షణాలు లేకుండా బయటపడే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం నడిపే రైలు సర్వీసులను రాష్ట్రంలో వద్దని అనవసరంగా ఇబ్బందులు వద్దని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ ముందు కూడా కేసీఆర్ ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: