గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో నానా తంటాలు పడుతున్నారు.  అమెరికా లాంటి అగ్ర రాజ్యం అతలా కుతలం అవుతుంది.  వెలల్లో మరణాలు, లక్షల్లో కరోనా కేసులునమోదు అయ్యాయి.  అయితే ఇప్పుడు కొన్ని దేశాల్లో లాక్ డౌన్ సడలిస్తున్నారు.  దాంతో ఉపాది పనులకు వెళ్లేవారు.. ఉద్యోగాలకు వెళ్లే వారికి వెసులు బాటు కల్పిస్తున్నారు ఆయా దేశ ప్రభుత్వాలు.  ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఇండోనేషియా ఎత్తివేస్తున్న‌ది. 45 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సు ఉన్న వారు ఉద్యోగాల‌కు వెళ్ల‌వ‌చ్చు అంటూ ఆదేశాలు జారీ చేసింది.

 

ఒక‌వేళ అండ‌ర్ 45 ఉన్న‌వాళ్లకు వైర‌స్ సోకినా.. వారికి ఎటువంటి ల‌క్ష‌ణాలు ఉండ‌వ‌ని అక్క‌డి అధికారులు అంటున్నారు.  మొన్నటి వరకు ఇక్కడ లాక్ డౌన్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, లాక్‌డౌన్ వ‌ల్ల ఇండోనేషియాలో సుమారు 28 ల‌క్ష‌ల మంది త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఇండోనేషియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 14625 కరోనా పాజిటివ్  కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు 991 మంది మ‌ర‌ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: