హీరోల‌ను చూసి.. సినిమాల్లో వారు చేసిన‌ట్టుగానే చేసేందుకు అభిమానులు ప్ర‌య‌త్నం చేస్తారు.. సాధార‌ణ వ్య‌క్తులు చేస్తే పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ.. అధికారులే ఇలాంటి ప‌నులు చేస్తే.. అదికూడా క‌రోనా టైంలో చేస్తే.. ఉన్న‌తాధికారులు ఊరుకుంటారా..? తాజాగా.. ఓ పోలీస్ అధికారి కూడా స్టంట్ చేసి ఏకంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. న‌డుస్తున్న‌ రెండు కార్ల‌పై త‌న కాళ్ల‌ని ఉంచి రిస్కీ స్టంట్ చేశాడు. ఇది అధికారుల దృష్టిన ప‌డ‌డంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన స‌బ్ ఇన్స్పెక్టర్ మనోజ్ యాద‌వ్ తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ సింగం సినిమాలోని సాంగ్‌తో‌  స్టంట్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

 

పోలీస్ డ్రెస్‌తో క‌ళ్ళ‌కి అద్దాలు పెట్టుకొని ఒక కారు మీద ఒక కాలు , రెండో కారు మీద మ‌రో కాలు ఉంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాడు. పోలీస్ అధికారి కావ‌డంతో ఆయ‌న స్టంట్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన పై అధికారులు ట్రాఫిక్ రూల్స్ అత్రిక‌మించిన కార‌ణంగా అత‌నిని స‌స్పెండ్ చేస్తూ రూ. 5వేల‌ జ‌రిమానా విధించారు. ఇక నెటిజ‌న్లుకూడా ఓ ఆటాడుకున్నారు. న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేస్తే ఎలా అంటూ ప్ర‌శ్నలు సంధించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: