ఉమ్మడి ప్రాజెక్ట్ పై ఏపీ తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏపీ సర్కార్ చెప్తున్నా మాటలకు ఆచరణకు చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేసారు. అపెక్స్ కమిటి అనుమతి లేకుండానే ఏపీ నిర్ణయం తీసుకుందని అన్నారు. 

 

805 లెవల్ లో లిఫ్ట్ పెట్టారు అంటే తెలంగాణా పై కుట్ర చేస్తున్నది  అని ఆరోపించారు. ఏపీది రెండు నాల్కల ధోరణి అని మంత్రి మండిపడ్డారు. కృష్ణా బోర్డ్ ఇచ్చిన నోటీసులకు ఏపీ ఇప్పటి వరకు సామాధానం ఇవ్వలేదని అన్నారు. విపక్షాలు ఈ అంశం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాయని జనవరి లోనే తాము ఫిర్యాదు చేసామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: