ఏ దుర్మూహూర్తంలో కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిందో కానీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.  రోజు దినసరి కూలీ చేసుకుని బతికే బడుగు జీవుల కన్నీటి పర్యంతం చేస్తుంది.. చిరుద్యోగులు, చిరు వ్యాపారస్తులకు నరకం ఏంటో కనిపిస్తుంది.  ఇక వలస జీవుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా నరకం ఏంటో ఇక్కడే అనుభవిస్తున్నారు.  అయితే కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి స్వచ్చంద సంస్థలు, సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకుడు ఆదుకుంటున్నారు.. అయితే ఈ సహయం అందని వారు మాత్రం పస్తులు పడుకునే పరిస్థితి నెలకొంటుంది.

 

ఇక దర్శకుడు, నటుడు లారెన్స్ ఎంత గొప్ప వ్యక్తి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఆయన చేస్తున్న మంచి పనులు, ఇస్తున్న విరాళాలే చెబుతుంటాయి. ఇప్పటికే కరోనా బాధితులకు రూ.4 కోట్లు ఇచ్చారు. పేదవారికి నిత్యావ‌స‌రాలు కూడా అందిస్తూ వ‌స్తున్నారు.  కొద్ది రోజుల క్రితం ఆయ‌న చెన్నైలో చిక్కుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ని చూసి చ‌లించిపోయారు. తిండి, నీడ లేక ఇబ్బంది ప‌డుతున్న 37 మంది ఆంధ్రా ప్ర‌జ‌లని వారి స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేయ‌మ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామిని కోరారు. తాజాగా  37 మందిని రైళ్ళ‌ల్లో స్వ‌స్థ‌ల‌లాకి పంపింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.

 

ఈ సంద‌ర్భంగా ప‌ళ‌నిస్వామికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ విష‌యంలో త‌మ‌వంతు బాధ్య‌త‌ని నిర్వ‌ర్తించిన  ఆఫీస‌ర్స్, క‌లెక్ట‌ర్స్ ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు లారెన్స్ . అంతే కాదు ఈ రోజు ప‌ళ‌నిస్వామి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు అందిస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్ధించారు. ‌

మరింత సమాచారం తెలుసుకోండి: