జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలను కాస్త పక్కన పెట్టి సినిమాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. వరుసగా ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇన్ని రోజులు గా ఒక ఆసక్తి ఉంది. ఇప్పుడు ఒక మలయాళం హీరోయిన్ ని పవన్ సినిమాకు ఎంపిక చేసారు. ఈ సినిమా షూటింగ్ పవన్ లేకుండానే జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: