చత్తీస్గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం కార్డియాక్ అరెస్ట్ తో ఆస్పత్రిలో జాయిన్ అయిన జోగీ... ఆరోగ్యం క్రమంగా విషమిస్తూ వస్తుంది. 74 ఏళ్ళ జోగీ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వైద్యానికి స్పందించడం లేదని  వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన కు శ్రీ నారాయణ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

 

ప్రస్తుతం ఆయన కోమా లో ఉన్నారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. మరో 24 గంటల వరకు ఆయన ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేమని వైద్య అధికారులు అంటున్నారు. అక్కడ ఆయనకు బలమైన నేత గా గుర్తింపు ఉంది గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టు ఉన్న నేత.

మరింత సమాచారం తెలుసుకోండి: