ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం మొదలైన నేపధ్యంలో ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా నది వరద జలాలను రాయలసీమ ప్రాంత జిల్లాలకు  ఎత్తి పొయ్యాలి అనే నిర్ణయం పై ఇప్పుడు తెలంగాణా అభ్యంతరం తెలిపింది. 

 

తెలంగాణా సిఎం కేసీఆర్ దీనిపై సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఇప్పుడు ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని మీద అనీల్ కుమార్ యాదవ్ తో సమాలోచనలు జరుపుతున్నారు. మొత్తం మూడు టీఎంసీలను ఎత్తిపోయ్యాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఇందుకోసం పరిపాలనా ఉత్తర్వులను కూడా ఇస్తూ నిధులను కూడా కేటాయించింది. మొత్తం 6, 829 కోట్లను కేటాయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: