ఈ మధ్య సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హవా మొదలయింది. తెలుగు పాటలను ఎక్కువగా వింటున్న ఈ క్రికెటర్ తెలుగు సినిమాలను కూడా ఎక్కువగా చూస్తున్నాడు. తెలుగు సినిమాలకు సంబంధించిన డైలాగులను టిక్ టాక్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియా లో ఈ వీడియో లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

 

తాజాగా బాబు మరో వీడియో రిలీజ్ చేసాడు. అల్లు అర్జున్ హీరో గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో సూపర్ హిట్ అయిన రాములో రాములా అనే పాట కు  భార్య తో కలిసి డాన్స్ వేసాడు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. వార్నర్ ఐపిఎల్ లో హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: