క‌రోనా వైర‌స్ కార‌ణంగా దాదాపుగా న‌ల‌భైరోజులుగా తెలంగాణ‌లో రాజ‌కీయ లొల్లిలేదు. కానీ.. ఇటీవల ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంపై, ప్ర‌ధాని మోడీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డంతో రాజ‌కీయ ర‌గ‌డ కాస్త మ‌ళ్లీ మొద‌లైంది. రాష్ట్రాల‌కు కేంద్రం ఏమీ సాయం చేయ‌డం లేద‌ని ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు కూడా కేసీఆర్‌కు ఇదే స్థాయిలో స‌మాధానాలు చెబుతున్నారు. అంతేగాకుండా.. సూటిగా కొన్ని ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కేంద్రం అందించిన సాయం, అవుతున్న ఖ‌ర్చులపై ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు మొత్తం రూ.6082కోట్లు ఇచ్చింద‌ని, విరాళాల రూపంలో రూ.500కోట్లు వ‌చ్చాయ‌ని, ఉద్యోగుల జీతాల కోత‌ల‌తో మ‌రో రూ.4000కోట్లు మిగిలాయ‌ని బీజేపీ నేతులు చెబుతున్నారు.

 

అంటే మొత్తం తెలంగాణ వ‌ద్ద రూ. 1082కోట్లు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇందులో క‌రోనా పేషెంట్ల‌కు ఒక్కొక్క‌రికి రూ.3.5ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, మొత్తం 1100మందికి రూ.39కోట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. అలాగే..ఇప్ప‌టివ‌ర‌కు చేసిన 20వేల క‌రోనా ప‌రీక్ష‌ల‌కు రూ.9కోట్లు, క్వారంటైన్‌లో 30వేల మందికి రూ.42కోట్లు, ఆస్ప‌త్రుల ఏర్పాటుకు రూ.100కోట్లు, పేద‌ల‌కు అందించిన ఆర్థిక సాయం ఖ‌ర్చు రూ.1200కోట్లు, బియ్యం ఖ‌ర్చు 1000కోట్లు, ఉద్యోగుల బోన‌స్‌కు రూ.100కోట్లు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు మ‌రో రూ.100కోట్లు ఖ‌ర్చుకాగా మొత్తం రూ.2500కోట్లు ఖ‌ర్చు అయింద‌ని, మిగిలిన డ‌బ్బు అంతా ఏమైంద‌ని బీజేపీ నేత‌లు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై అధికార టీఆర్ఎస్ ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి మ‌రి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: