రాష్ట్రంలో పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఓ వైపు లాక్ డౌన్ నిబంధనలు, మరోవైపు అరకొర కొనుగోళ్లతో నష్టాలపాలు అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం పసుపు క్వింటాలుకు రూ.6,850ల గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదని లోకేష్ ఆరోపించారు.

 

ఎన్నికలకు ముందు క్వింటా రూ.15వేలు ఉంటేగానీ పసుపుకు గిట్టుబాటు కాదని ఊదరగొట్టిన వైసీపీ.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పసుపుకు కనీసం రూ.10వేలు ధర ఉంటే కానీ రైతుకు గిట్టుబాటు కాదని అన్నారు.  ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న పసుపు రైతులను తక్షణమే ఆదుకొండని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: