ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది రాజకీయాల్లోకి వెళ్లారు. కొంత మంది సక్సెస్ అయితే.. మరికొంత మంది ఫెయిల్యూర్ అయ్యారు.  అయితే తెలుగు ఇండస్ట్రీపై రాజకీయ ముద్ర మాత్రం బాగానే ఉంటుంది.  తెలుగు లో నటసార్వభౌములు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టి ఓ ప్రభంజనం సృష్టించారు.  ఆ తర్వాత చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టారు.. తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు.  విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టి టీఆర్ఎస్ లోవిలీనం చేశారు.  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. ప్రస్తుతం నటులు, దర్శకులు, నిర్మాతలు రాజకీయాల వైపు వెళ్లుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో sridhar REDDY' target='_blank' title='మధుర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మధుర శ్రీధర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

 

దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతేకాదు, sridhar REDDY' target='_blank' title='మధుర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మధుర ఆడియో కంపెనీ ద్వారా సినిమా పాటలను విడుదల చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2024 ఎన్నికలకు ముందే రాజకీయ అరంగేట్రం చేస్తానని... ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు.  కాకపోతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.  చాలా మంది ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: