టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి పెళ్లి కుదరడం తో లాక్ డౌన్ లో సప్పగా ఏ జోష్ లేకుండా ఉన్న అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా లో పండగ చేసుకుంటున్నారు. రానా పెళ్లి వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అగ్ర కుటుంబం నుంచి వచ్చినా సరే అందరి తో సన్నిహితంగా ఉంటాడు రానా. అతను మిహీకా బజాజ్ అనే ఒక వ్యాపారవేత్త ను వివాహం చేసుకోనున్నాడు. ఆమె ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

 

అతనికి సోషల్ మీడియా లో, బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినీ ప్రముఖులు అందరూ కూడా రానా పెళ్లి వార్తను షేర్ చేస్తూ అతనికి అభినందనలు చెప్తున్నారు. రానా జీవితంలో మరింత పైకి రావాలని, అతనికి ఆరోగ్యం ఆదాయం అన్నీ కలిసి రావాలని కోరుకుంటూ కొత్త జంట కు అప్పుడే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: