చిన్న పిల్లలు.. నిన్ననాటి గుర్తులు ఎంత మధుంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  చిన్న పిల్లలు ఎంత ముందు వస్తారో.. చిన్నపిల్లలుగా ఉన్న ఆవు దూడలు, గేదె దూడలు, పక్షుల పిల్లలు, కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భలే ముద్దొస్తుంటాయి. వాటి గెంతులు, ఉరుకులు, పరుగులు చాలా తమాషాగా అనిపిస్తుంటాయి. వాటితో ఎంత సేపు ఆడుకుంటున్నా అలాగే ఆడుకోవాలనిపిస్తుంది. ఇలా ముద్దు ముద్దుగా ఉండేవాటితో చిన్నపిల్లలు, పెద్దవారు సైతం లోకాన్ని మర్చిపోతూ ఆడుకుంటారు.  అవి కూడా అమాయకంగా ఆడుకోవడం చూస్తూనే ఉంటాం.  ఓ గున్న ఏనుగు పిల్ల తన తల్లి వెనకాల పచ్చిక బయళ్లలో ఉంది.

 

పెద్ద ఎనుగులు ఆహారం తింటుంటే.. ఆ బుల్లి ఎనుగు మటుకు దగ్గరే ఉన్న కొంగలను పట్టుకోవడాని తెగ ప్రయత్నం చేస్తూ అటూ ఇంటూ పరుగులు పెడుతుంది. ఏంటీ నాకు ఒక్కటి కూడా దొరకడం లేదు అన్నట్టు తెగ ఆరాట పడుతుంది. తెల్లగా ఉన్న అవి దాని కంటికి ఎలా కనిపించాయో గానీ.. వాటిని తరుముతూ సయ్యాటలు ఆడింది. పాపం ఆ కొంగలేమో తమ పొట్ట తిప్పల కోసం ఆ ఎనుగులను చూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను వైల్డ్ లైఫ్ వీడియోలను కంటిన్యూగా షేర్ చేసే IFS ఆఫీసర్ సుశాంత నందా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: