ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 203 పై తెలంగాణా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది, కృష్ణా బోర్డ్ కు తెలంగాణా సర్కార్ ఈ సందర్భంగా ఫిర్యాదు చేసింది. కృష్ణా నదీ వరద జలాలను ఎత్తిపోయాలి అని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మూడు టిఎంసిల నీటిని ఎత్తి పోయడానికి గానూ జీవో ని విడుదల చేసింది. 

 

దీనిపై స్పందించిన తెలంగాణా సర్కార్... ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని పేర్కొంది. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్ట్ కడుతున్నారని మండిపడింది. నిబంధనలకు విరుద్దంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంది అని పేర్కొంది. దీనిపై రేపు కృష్ణా బోర్డ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ రేపు చేపడుతుంది. కాగా దీనిపై అక్కడ అధికార విపక్ష నేతలు ఏపీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: