ఒక్క వైర‌స్‌.. ఒకే ఒక్క వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 42ల‌క్ష‌ల మందిపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని ఆవేద‌న వ్య‌క‌త్ం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ రాత్రి 8గంట‌ల‌కు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మాన‌వాళికి ఈ వైర‌స్ పెద్ద స‌వాల్‌గా మారుతోంద‌ని అన్నారు. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ఈ ప్ర‌పంచం యుద్ధం చేస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. నాలుగు నెల‌లుగా క‌రోనాపై యుద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటూ వైర‌స్‌పై యుద్ధం చేద్దామ‌ని మోడీ పిలుపునిచ్చారు.

 

మ‌నంద‌రం మ‌రింత ఆత్మ‌స్థైర్యంతో ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న కోరారు. మ‌రింత సంక‌ల్ప బ‌లంతో ముందుకు వెళ్లాల‌ని, ఇది గెలిచి తీరాల్సిన యుద్ధ‌మ‌ని ఆయ‌న అన్నారు. స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న సూచించారు. 21వ శ‌తాబ్దం భార‌త్‌దేన‌ని మోడీ అన్నారు.  ఈ యుద్ధంలో భార‌త్ త‌ప్ప‌కుండా గెలిచితీరుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: