ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది కరోనా భారీన పడ్డారని అన్నారు. కరోనా లాంటి సంక్షోభం గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. 21వ శతాబ్దం భారత్ దే అని అన్నారు. ప్రస్తుతం చాలా కీలకమైన దశలో ఉన్నామని చెప్పారు. ప్రతిరోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు ఉత్పత్తి చేస్తున్నామని అన్నార్. కరోనాపై యుద్ధంలో మనిషి ఓడిపోవడానికి సిద్ధంగా లేడని వ్యాఖ్యలు చేశారు. 
 
మనం మరింత ధృడమైన సంకల్పంతో ముందుకెళ్లాలని సూచించారు. స్వీయ నియంత్రణతో మాత్రమే కరోనాను కట్టడి చేయగలమని చెప్పారు. ఆపదను అవకాశంగా మార్చుకోవాలని సూచించారు ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. మన సంకల్పం ఈ సంక్షోభం కంటే గొప్పదని మోదీ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

war