ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ భారత్ సత్తా ఎంతో ప్రపంచం చూస్తోందని చెప్పారు. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీలో 10 శాతం ఈ ప్యాకేజ్ అని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ వివ‌రాల‌ను ఆర్థిక మంత్రి ప్ర‌క‌టిస్తారని చెప్పారు. స్వ‌యం స‌మృద్ధి, ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ల్యాండ్, లేబర్, లా, లిక్విడీటీలకు ఈ ప్యాకేజ్ వల్ల ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని చెప్పరు. సూక్ష్మ, మధ్య తరగతి వర్గాలకు ఈ ప్యాకేజీ వర్తిస్తుందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వాలనే ఈ ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: